తెలంగాణ
వరంగల్ MGM ఆసుపత్రిలో నిలువెత్తు నిర్లక్ష్యం.. మృతదేహాలు తారుమారు

Warangal MGM Hospital: వరంగల్ MGM ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఒకరి డెడ్‌బాడీ అప్పగించబోయి మరొకరి మృతదేహం అప్పగించారు. మైలారానికి చెందిన కుమారస్వామి అనా రోగ్యంతో మృతి చెందాడు. దీంతో కుమారస్వామి మృతదేహానికి బదులు మరొకరి డెడ్‌బాడీని కుటుంబసభ్యులకు అప్పగించారు ఎమ్‌జీఎం సిబ్బంది.
అయితే అంత్యక్రియలు జరుగు తున్న సమయంలో తండ్రి కుమారస్వామి మృతదేహం కాదని కూతురు గుర్తించింది. ముక్కుమొహం తెలియని వ్యక్తికి తాను తలకొరివి పెట్టనని గొడవకు దిగింది. తల్లి-కూతురు ఫిర్యా దుతో రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాన్ని MGM ఆసుపత్రికి తరలించారు. మరోవైపు MGM సిబ్బంది మాత్రం ఇది బాధిత కుటుంబసభ్యుల పొరపాటే అంటున్నారు.