ప్రియాంక లుక్‌పై రాజమౌళి దృష్టి!

SSMB29: దర్శకధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో హాలీవుడ్ స్థాయి చిత్రం తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా నటిస్తోంది. పాన్ ఇండియా అంచనాలు ఉన్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ లుక్ రిలీజైంది. ఇప్పుడు ప్రియాంక ఫస్ట్ లుక్, పాత్ర పేరు వెల్లడవుతాయి.
ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం హాలీవుడ్ స్థాయిలో రూపొందనుంది. ఈ అడ్వెంచర్ థ్రిల్లర్‌లో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే కుంభ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. అందరూ మహేష్ బాబు ఫస్ట్ లుక్, పాత్ర పేరు కోసం ఎదురుచూస్తున్నారు.
టీమ్ మహేష్ లుక్‌తో పాటు టైటిల్‌ను ఒకేసారి రివీల్ చేయాలని ప్లాన్ చేస్తోంది. అంతకుముందు ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ పోస్టర్, ఆమె పాత్ర పేరును నవంబర్ 11న వెల్లడి చేస్తారట. ప్రస్తుతం రాజమౌళి దృష్టి ప్రియాంక లుక్‌పై ఉంది. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కథ విజయేంద్రప్రసాద్, సంభాషణలు దేవా కట్టా అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పై భారీ హైప్ నెలకొంది.



