సినిమా

SS Rajamouli: మహేష్ అభిమానులకు రాజమౌళి సూచనలు!

SS Rajamouli: మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ‘గ్లోబ్ ట్రాటర్’ టైటిల్ రివీల్ ఈ నెల 15న జరగనుంది. సుమతో కలిసి ఆశిష్ చంచ్లానీ ఈవెంట్ హోస్ట్ చేయనున్నాడు. ఢిల్లీ బ్లాస్ట్ నేపథ్యంలో భద్రత ఆందోళన నెలకొంది. తాజాగా రాజమౌళి కొన్ని సూచనలతో వీడియో రిలీజ్ చేశారు.

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాన్ని ప్రస్తుతం ‘గ్లోబ్ ట్రాటర్’గా పిలుస్తున్నారు. ఈ సినిమా టైటిల్ రివీలింగ్ ఈవెంట్ నవంబర్ 15న సాయంత్రం 5:30 నుంచి ప్రారంభం కానుంది. ఈవెంట్ హోస్ట్‌గా సుమతోపాటు మహారాష్ట్రకు చెందిన యూట్యూబర్ ఆశిష్ చంచ్లానీ వ్యవహరించనున్నాడు. నార్త్ ఇండియాలో ఆశిష్‌కు మంచి క్రేజ్ ఉండగా, పలు సినిమా ప్రమోషన్లలోనూ పాల్గొన్నాడు. అయితే ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత హైదరాబాద్‌తోపాటు మెట్రో నగరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

బహిరంగ కార్యక్రమాలకు అనుమతులు నిరాకరిస్తున్న నేపథ్యంలో ఈ ఈవెంట్ ఓపెన్‌గా జరుగుతుందా లేక క్లోజ్డ్ ఈవెంట్‌గానే పరిమితమవుతుందా, ఫ్యాన్స్ ఈవెంట్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందా అనే దానిపై వీడియో రిలీజ్ చేస్తూ జక్కన్న క్లారిటీ ఇచ్చాడు. ఈ వీడియోలో ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కు ఎలా రావాలో సూచనలు ఇచ్చాడు. సోషల్ మీడియాలో పాస్ లు లేకుండా కూడా రావొచ్చనే వార్తలను ఖండించాడు. కచ్చితంగా పాస్ లతోనే రావాలని రాజమౌళి సూచించాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button