ఆంధ్ర ప్రదేశ్
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద.. రెండు గేట్లు ఎత్తి నీరు విడుదల

నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. 2గేట్లను 10 అడుగుల మేర ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 75 వేల 383 క్యూసెక్కులుగా ఉంది. ఔట్‌ఫ్లో లక్షా 21 వేల 482 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. 883 అడుగులకు నీటినిల్వ 207 టీఎంసీలకు చేరినట్లు అధికారులు తెలిపారు. కుడి, ఎడమ జల విద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి కొనసాగుతుంది.