ఆంధ్ర ప్రదేశ్
Srisailam: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం.. 4 గేట్లు ఎత్తి నీరు విడుదల

Srisailam: ఎగువ నుంచి కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. 4 గేట్లు 10 అడుగులు మేర ఎత్తివేత అధికారులు నీటిని విడుదల చేశారు. లక్షా 51 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తోంది.
ఔట్‌ఫ్లో లక్షా 74 వేల క్యూసెక్కుల నీటి అధికారులు విడుదల చేరశారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. ప్రస్తుతం జలాశయంలో 883 అడుగుల నీటిమట్టం వద్ద 204 టీఎంసీల నిల్వ ఉంది.



