తెలంగాణ
Srinivas Goud: కల్లు కాంపౌండ్లను ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర

Srinivas Goud: కల్లు కాంపౌండ్లను ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. కాంపౌండ్‌లో కల్లును కల్తీ చేసి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ పార్టీ కుల వృత్తులను అనేక హామీలు ఇచ్చిందని అన్నారు.
ప్రభుత్వానికి ఆదాయం వచ్చే కుల వృత్తులను కాంగ్రెస్ పార్టీ నాశనం చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. కల్తీకి వ్యతిరేకమే కానీ కల్లు వృతినే నిషేధిస్తామంటే సహించేది లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.