తెలంగాణ

Sridhar Babu: క్యాన్సర్ బాధితుడి మాటలకు మంత్రి శ్రీధర్ బాబు కన్నీళ్లు

Sridhar Babu: సార్, నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. పెద్ద క్రికెటర్ కావాలని కలగన్నా నాకో క్రికెట్ కిట్ ఇప్పించండి సార్” క్యాన్సర్ తో పోరాడుతున్న ఓ యువకుడి మాటలివి. వింటే మనసున్న ప్రతీ మనిషికీ గుండె చెమర్చక మానదు. ఈ మాటలకు మంత్రి శ్రీధర్ బాబు ఏకంగా భావోద్వేగానికి గురయ్యారు. భూపాలపల్లి జిల్లా పాలిమల మండలం సర్వాయ్‌పేట గ్రామానికి చెందిన భౌత్ నితిన్ కాన్సర్‌తో బాధపడుతూ హైదరాబాద్‌లోని స్పర్శ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

విషయం తెలుసుకున్న మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా ఆసుపత్రికెళ్లి పరామర్శించారు. నేనున్నానని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా నితిన్ మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న శ్రీధర్ బాబు.. అప్పటికప్పుడు క్రికెట్ కిట్ తెప్పించి అతని కోరికను నెరవేర్చారు. సొంతన్నగా వెంట నిలుస్తానని, ఏ అవసరమున్నా నేరుగా నన్ను సంప్రదించండి అంటూ నితిన్ తల్లిదండ్రులకు మంత్రి ధైర్యం చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button