తెలంగాణ
Sridhar Babu: హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోంది

Sridhar Babu: ఏ రాష్ట్రం చేయాలేని అభివృద్ధి సంక్షేమ పథకాల అమలును రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 2047 నాటికీ 3 ట్రిలియన్ డాలర్స్ ఏకానమి లక్ష్యంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామన్నారు.
బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలలో వాస్తవం లేదన్నారు. హిల్ట్ పాలసీపై జీవో జారీ కాగానే కుంభకోణం అని బీఆర్ఎస్ నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలన్నదే బీఆర్ఎస్ ఉద్దేశమంటున్న మంత్రి శ్రీధర్ బాబు.



