‘పెద్ది’లో శ్రీలీల?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా, ఈ సినిమాకు సంబంధించి ఓ సంచలన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. వివరాలు చూద్దాం!
రామ్ చరణ్ రగడ్ లుక్‌తో ఆకట్టుకుంటున్న ‘పెద్ది’ సినిమా క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ చిత్రంలో మాస్ మసాలా సాంగ్ ఒకటి ఉంటుందని, అందులో యంగ్ సెన్సేషన్ శ్రీలీల స్పెషల్ డ్యాన్స్ చేయనుందని సినీ సర్కిల్స్‌లో జోరుగా చర్చ నడుస్తోంది. ‘పుష్ప-2’లో ‘కిస్సిక్’ సాంగ్‌తో నేషన్వైడ్ క్రేజ్ సొంతం చేసుకున్న శ్రీలీల, ఇప్పుడు ‘పెద్ది’లో మరోసారి స్పెషల్ అవతారమెత్తే అవకాశం ఉందని తెలుస్తోంది.
బుచ్చిబాబు ఈ సాంగ్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నారట. అయితే, సెలెక్టివ్‌గా ప్రాజెక్ట్‌లు చేస్తున్న శ్రీలీల ఈ ఆఫర్‌ను ఒప్పుకుంటుందా లేదా అనేది ఆసక్తికరం. ఒకవేళ ఈ కాంబినేషన్ కన్ఫర్మ్ అయితే, ‘పెద్ది’ క్రేజ్ డబుల్ అవడం ఖాయం.