శ్రీలీల ఖాతాలో మరో బిగ్ ప్రాజెక్ట్?

Sreeleela: యంగ్ హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్‌లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. కరణ్ జోహార్ నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్ట్‌లో ఆమె హీరోయిన్‌గా ఎంపికైంది. విక్రాంత్ మాస్సే సరసన నటిస్తూ శ్రీలీల అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. పూర్తి వివరాలు చూద్దాం.
శ్రీలీల తన నటన, డ్యాన్స్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ తన గుర్తింపు సాధించేందుకు సిద్ధమవుతోంది. కరణ్ జోహార్ నిర్మాణంలో రూపొందుతున్న ‘దోస్తానా 2’లో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుందని సమాచారం. విక్రాంత్ మాస్సే హీరోగా నటిస్తున్న ఈ చిత్రం యువతను ఆకర్షించేలా ఉంటుందని అంటున్నారు.
మొదట జాన్వీ కపూర్ ఈ పాత్ర కోసం ఎంపికైనా, ఆమె తప్పుకోవడంతో శ్రీలీలకు ఈ అవకాశం దక్కింది. ఇప్పటికే కార్తిక్ ఆర్యన్ సరసన ఒక బాలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్న శ్రీలీలకు ఈ చిత్రం మరో బ్రేక్‌గా నిలవనుంది. కరణ్ జోహార్ ఈ ప్రాజెక్ట్‌పై తుది చర్చలు జరుపుతున్నారు. శ్రీలీల నటన, డ్యాన్స్ నైపుణ్యం బాలీవుడ్‌లో కూడా ఆకట్టుకుంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.



