Single: శ్రీవిష్ణు ‘సింగిల్’ రచ్చ.. అమెరికాలో మరో సూపర్ రికార్డ్

Single: శ్రీవిష్ణు నటించిన ‘సింగిల్’ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ సూపర్ హిట్‌గా నిలిచింది. ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాకు జోరుగా కలెక్షన్లు వస్తున్నాయి.
శ్రీవిష్ణు హీరోగా కార్తిక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సింగిల్’ సినిమా బాక్సాఫీస్‌లో దూసుకెళ్తోంది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌లో శ్రీవిష్ణు తనదైన టైమింగ్‌తో అలరించాడు. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది.
గీతా ఆర్ట్స్, కళ్యా ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం అమెరికాలో 700K డాలర్లకు పైగా వసూలు చేసింది. పోటీ సినిమాలు లేకపోవడంతో ఈ వారం కూడా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని నిర్మాతలు ధీమాగా ఉన్నారు. ఈ సినిమా యూఎస్‌లో 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుంటుందనే ఆసక్తి నెలకొంది.