తెలంగాణ
ఈ నెల 6 నుంచి ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ

ఈ నెల 6 నుంచి ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ విచారించనున్నారు. ఈ నెల 6, 7, 12, 13 తేదీల్లో విచారణ జరుపుతారు. మొదట పిటిషనర్లు, తర్వాత ప్రతివాదులను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. రోజుకు ఇద్దరు చొప్పున క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. డాక్టర్ సంజయ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకటరావు, అరికెపూడి గాంధీపై దాఖలైన పిటిషన్లపై స్పీకర్ విచారణ జరపనున్నారు.



