సినిమా

Sonu sood wife: సోనూ సూద్ భార్యకు యాక్సిడెంట్

Sonu sood wife: ప్రముఖ నటుడు సోనూ సూద్ భార్య సోనాలి సూద్ నాగపూర్ హైవేపై జరిగిన భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. సోనాలి సూద్ ప్రయాణిస్తున్న కారును అదుపుతప్పిన ఓ లారీ ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే, కారు డ్రైవర్ తక్షణమే అప్రమత్తమై చాకచక్యంగా వాహనాన్ని నియంత్రించడంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ఘటనలో సోనాలి సూద్‌కు స్వల్ప గాయాలు అయినప్పటికీ, ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం ఆమె ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ సంఘటన తర్వాత సోనూ సూద్ బృందం మీడియాతో మాట్లాడుతూ, అభిమానులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని కోరింది.

సోనాలి స్థితి నిలకడగా ఉందని, భయపడాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేశారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే సోనూ సూద్ కుటుంబం, సన్నిహితులు ఆసుపత్రికి చేరుకున్నారు. సోనాలి త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో సందేశాలు పంపుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button