జాతియం
Tamil Nadu: బీమా డబ్బు కోసం తండ్రినే హత్య చేసిన కుమారులు

Tamil Nadu: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన పాము కాటు మరణ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. గవర్నమెంట్ స్కూల్ ల్యాబ్ అసిస్టెంట్ గణేషన్ పాము కాటు కారణంగా మరణించినట్లు భావించగా పోలీసులు దర్యాప్తులో గణేషన్ బీమా క్లయిమ్ కోసం కుమారులే హత్య చేశారని తేలింది. 3 కోట్ల బీమా సొమ్ము కోసం గణేషన్‌ను కుమారులే పాము కాటుతో చంపారని పోలీసులు తెలిపారు.
గణేషన్ అంత్యక్రియలు పూర్తయిన వారం రోజుల్లోనే ఆయన పేరుమీద ఉన్న 3 కోట్ల కోసం ఇద్దరు కుమారులు బీమా సంస్థను సంప్రదించినట్లు పోలీసులు గుర్తించారు. గణేషన్ కుమారులు ఇద్దరు జూదం, బెట్టింగ్ ఆర్థికంగా నష్టపోవడంతో తండ్రి పేరుపై ఉన్న బీమా సొమ్ము కోసం తండ్రి హత్యకే ప్లాన్ చేశారు.



