సినిమా

Sonam Bajwa: ఇంటిమేట్ సీన్స్‌పై సోనమ్ బజ్వా షాకింగ్ రివీల్

Sonam Bajwa: పంజాబీ బ్యూటీ సోనమ్ బజ్వా సినిమాల్లో ఇంటిమేట్ సీన్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పేరెంట్స్ కోసం ఆ సీన్స్‌ను నిరాకరించినట్లు చెప్పారు. కానీ, ఆ తరువాత తల్లిదండ్రుల స్పందన విని ఆశ్చర్యపోయారట.

సోనమ్ బజ్వా పంజాబీ, హిందీ, తెలుగు సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుంది. కెరీర్ ఆరంభంలో ఇంటిమేట్ సీన్స్, కిస్ సీన్స్‌ను నిరాకరించారు. పేరెంట్స్‌తో కలిసి సినిమా చూస్తే అసౌకర్యంగా ఉంటుందని, పంజాబీ ప్రేక్షకులు ఒప్పుకోరని భయపడ్డారు. ఈ కారణంగా బాలీవుడ్‌లో పెద్ద సినిమాల్లో అవకాశాలు కోల్పోయారు. తల్లిదండ్రులతో ఈ విషయం చర్చించినప్పుడు, వారు “ఇది నటనలో భాగమే, అన్ని సీన్స్ చేయాలి” అని స్పందించారు.

ఈ రియాక్షన్ సోనమ్‌ను ఆశ్చర్యపరిచింది. పేరెంట్స్ బాధపడతారని భావించి ఇన్నేళ్లు అవకాశాలు కోల్పోయినట్లు ఆమె బాధపడ్డారు. తెలుగులో ‘ఆటాడుకుందాం రా’, ‘బాబు బంగారం’ సినిమాల్లో నటించిన సోనమ్, ఇటీవల ‘హౌస్ ఫుల్ 5’లో కనిపించారు. ప్రస్తుతం ‘ఏక్ దివానీ కి దివానియత్’ ప్రమోషన్స్‌లో ఈ విషయాలను పంచుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button