News

Sonali Bendre: సినీ ప్రయాణంపై సోనాలి బింద్రే షాకింగ్ కామెంట్స్

Sonali Bendre: సీనియర్ నటి సోనాలి బింద్రే తన సినీ కెరీర్‌లోని ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. మాతృత్వ దశను ఆస్వాదించి, క్యాన్సర్‌తో పోరాడిన ఆమె, నటనపై తన అభిమానాన్ని వెల్లడించారు. ఆమె చెప్పిన క్రేజీ విషయాలు ఇప్పుడు చూద్దాం.

బాలీవుడ్ సీనియర్ బ్యూటీ సోనాలి బింద్రే నటనపై తనకున్న అభిమానాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఓ సినిమా సీక్వెల్ షూటింగ్ సమయంలో గర్భవతిగా ఉన్నప్పటికీ, ఎనిమిది నెలల పాటు రోజూ సెట్‌కు వచ్చి నటించారు.

బిడ్డ కదలికలు తెలుస్తున్నా, నటనపై ఆమె ప్యాషన్ ఆమెను ఆపలేదు. బిడ్డ జననం తర్వాత సినిమాలకు విరామం తీసుకుని, తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తించారు. మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాదించిన ఆమె, ఆ తర్వాత టీవీ షో ద్వారా మళ్లీ ప్రేక్షకులను అలరించారు.

అయితే, ఆ సమయంలోనే క్యాన్సర్ నిర్ధరణ కావడంతో మరోసారి కెరీర్‌కు బ్రేక్ పడింది. అయినా, ధైర్యంగా పోరాడి, మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు. నటన పట్ల అమితమైన ఇష్టంతో, కష్టాలను అధిగమించి మళ్లీ సినీ ప్రపంచంలో సందడి చేస్తున్న సోనాలి బింద్రే నిజంగా ఓ స్ఫూర్తి అని ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button