తెలంగాణ
Beeramguda: మామను కత్తితో పొడిచి చంపిన అల్లుడు

Beeramguda: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధీలోని బీరంగూడలో దారుణం చోటుచేసుకుంది. మామపై అల్లుడు రమేష్ విచక్షణారహితంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. తీవ్ర రక్త స్రావంతో చంద్రయ్య అక్కడికక్కడే మరణించాడు.
కూతురుతో అల్లుడు తరచూ గొడవ పడుతుండడంతో కుమార్తెను పుట్టింటింకి తీసుకొచ్చాడు చంద్రయ్య. ఈ క్రమంలోనే తన భార్యను కాపురానికి పంపడం లేదని మద్యం మత్తులో మామాపై దాడి చేసి హత్య చేశాడు అల్లుడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



