ఆంధ్ర ప్రదేశ్
Nellore: అత్తను చంపి పూడ్చిపెట్టిన అల్లుడు

నెల్లూరు జిల్లా నాయుడుపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అత్తను చంపి పూడ్చిపెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయ్యప్పరెడ్డి పాలెం గ్రామానికి చెందిన చెంగమ్మను అల్లుడు బోడెద్దుల వెంకయ్య నమ్మించి స్వర్ణముఖి నది వద్దకు తీసుకెళ్లి హత్యచేసి పూడ్చిపెట్టాడు. భార్యను కాపురానికి పంపడం లేదని అత్తపై కక్ష పెంచుకుని హతమొందించాడు.
వివాదాల కారణంగా భర్తతో స్వాతి దూరంగా ఉంటుంది. అత్త వల్లే భార్య కాపురానికి రావడంలేదని కక్ష పెంచుకుని హతమొందించాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.