తెలంగాణ
Siddipet: ఆస్తి కోసం అత్తను చంపిన అల్లుడు

Siddipet: ఆస్తి కోసం సొంత అల్లుడే అత్తను చంపిన ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డి పల్లిలో చోటుచేసుకుంది. తిమ్మారెడ్డి పలికి చెందిన రాములమ్మ రాజీవ్ రహదారి పక్కన హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తుంది. ములుగు మండలం తునికిబొల్లారం గ్రామానికి చెందిన జీవన్ రెడ్డితో తన కుమార్తెకు వివాహం జరిపించింది.
అయితే రాములమ్మ పేరిట ఉన్న రెండెకరాల భూమి కోసం అల్లుడితో తరుచూ గొడవలు జరుగుతుండేవి. తాను చనిపోయిన తర్వాత ఆ భూమిని తీసుకోండి అని అల్లుడితో తేల్చి చెప్పగా ఈ క్రమంలోనే అత్తను మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి హత్య చేశాడు అల్లుడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



