ఆంధ్ర ప్రదేశ్
Visakha: భార్య, అత్తపై అల్లుడి దాడి

Visakha: విశాఖ జిల్లా పెందుర్తిలో దారుణం చోటుచేసుకుంది. అప్పారావు అనే వ్యక్తి తన భార్య, మరియు అత్తపై విచక్షణరహితంగా దాడి చేశాడు. అప్పారావు అతని భార్య కనకమహాలక్ష్మి గత ఎనిమిది సంవత్సరాలుగా వేరుగా ఉంటున్నారు.
ఏమైందో తెలియదు కానీ భార్య, అత్తపై అప్పారావు సుత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన కనకమహాలక్ష్మి, లక్ష్మీలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.



