తెలంగాణ
గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్

గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడింది. గాంధీనగర్‌కు చెందిన యామిని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఆమె స్నేహితులతో కలిసి ఉండేది. ఆఫీసుకు వెళ్లిన ఆమె స్నేహితులు సాయంత్రం గదికి వచ్చి చూడగా కిటికీ గ్రిల్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.