తెలంగాణ
Gachibowli: గచ్చిబౌలిలో బోర్డు తిప్పేసిన మరో సాఫ్ట్వేర్ కంపెనీ

Gachibowli: గచ్చిబౌలిలో మరో సాఫ్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఉద్యోగాలు ఇస్తామని ప్యూరోపాల్ క్రియేషన్ అండ్ ఐటీ సోలుషన్స్ కంపెనీ టోకరా వేసింది. ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగుల నుంచి యాజమాన్యం డబ్బులు వసూల్ చేసింది. ఒక్కొక్కరి నుంచి 2 లక్షల నుంచి 2.50లక్షల వరకు కంపెనీ యజమాని వసూల్ చేశారు.
200 మంది నుంచి డబ్బులు వసూల్ చేసినట్లు బాధితులు తెలిపారు. కోచింగ్ ముగిసిన తర్వాత ఎటువంటి ఉద్యోగం ఇవ్వకుండా కంపెనీ కాలం గడుపుతూ వచ్చింది. డబ్బులు కట్టిన వారు ప్రశ్నించడంతో కంపెనీ బోర్డు తిప్పేసింది. గచ్చిబౌలి పీఎస్లో బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితులకు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్ మద్దతు తెలిపారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.