స్కైడైవర్‌కు చుక్కలు.. 15000 అడుగుల ఎత్తులో విమానం తోకకు చిక్కుకున్న పారాచూట్, వీడియో

ఆస్ట్రేలియా అధికారులు విడుదల చేసిన హృదయ విదారక దృశ్యాలు ఎవరి గుండెల్లోనైనా దడ పుట్టిస్తాయి. 15 వేల అడుగుల ఎత్తులో విమానం నుంచి దూకిన స్కైడైవర్ పారాచూట్ ఒక్కసారిగా విమానం తోకకు చిక్కుకుని, వేల మీటర్ల దూరం గాలిలో తూలుతూ ప్రాణాల కోసం పోరాడిన క్షణాలు ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి.
భయపడెతున్నాయి. కలవరానికి గురిచేస్తున్నాయి. సెప్టెంబర్‌లో కైర్న్స్ దక్షిణంలో జరిగిన ఈ ఘటనలో స్కైడైవర్ అద్భుతంగా ప్రాణాలతో బయటపడటం నిజంగా అదృష్టం. రవాణా భద్రతా వాచ్‌డాగ్ దర్యాప్తు పూర్తిచేసిన తర్వాత ఈ వీడియోను తాజాగా విడుదల చేసింది.
ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై విచారణ చేయడంతో అన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. 16 మంది స్కైడైవర్స్ కలిసి ఫార్మేషన్ జంప్‌కు సిద్ధమవుతుండగా, విమానం నుంచి మొదటి వ్యక్తి బయటకు వచ్చిన కొన్ని సెకన్లకే అనూహ్య గందరగోళం చోటుచేసుకుంది. పారాచూట్ హ్యాండిల్ విమానం రెక్క పైన ఉన్న ఫ్లాప్‌కు ఢీ కొట్టడంతో రిజర్వ్ చ్యూట్ ఆటోమేటిక్‌గా తెరుచుకుంది.
ఆ తెరచిన చ్యూట్ వెంటనే విమానం తోకకు చిక్కుకోవడంతో జంపర్ గాల్లో ఆగిపోయాడు. కెమెరా ఆపరేటర్ రికార్డ్ చేసిన ఆ దృశ్యాల్లో, షాక్‌లో ఉన్న స్కైడైవర్ హెల్మెట్‌పై చేతులు ఉంచుకుని ఏం జరుగుతుందో గ్రహించడానికి ప్రయత్నించడం ఒక్కసారిగా దడ పుట్టిస్తుంది.
మరణం అంచు నుంచి ఎలా బయటపడ్డాడటం సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వేలాడుతూ ఉన్న ఆ ప్రమాదకర స్థితిలో, జంపర్ వెంట తీసుకెళ్లే హుక్ నైఫ్‌తో రిజర్వ్ చ్యూట్ తీగలను చాకచక్యంగా కత్తిరించి తనను తాను విమానం నుంచి వేరుచేసుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. వాస్తవానికి కత్తి తీసుకెళ్లడం తప్పనిసరి కాదు. కానీ ఇలాంటి అత్యవసర పరిస్థితిలో అది ప్రాణాలను రక్షిస్తుందని ATSB చీఫ్ కమిషనర్ అంగస్ మిచెల్ చెప్పారు.
విమానం తోక భాగం తీవ్రమైన నష్టాన్ని చవిచూసినందున పైలట్‌కు విమానం నియంత్రించడం కష్టంగా మారింది. వెంటనే ‘మేడే’ డిస్ట్రెస్ కాల్ ఇచ్చినా అద్భుతమైన నైపుణ్యంతో పైలట్ చివరకు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఒక స్కైడైవర్ చాకచక్యం, ఒక పైలట్ ధైర్యం రెండు ప్రాణాలను కాపాడించింది.



