తెలంగాణ
Hyderabad: చెరువులో పడి ఆరేళ్ల చిన్నారి మృతి

హైదరాబాద్ సరూర్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. చెరువులో పడి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. చెరువుకు ఫెన్సింగ్ లేకపోవడంతో ఘటన జరిగింది. నిన్న సాయంత్రం చెరువులో పడిపోయింది చిన్నారి. ఇవాళ నీటిపై బాడీ తేలడంతో బాధితులు గుర్తించారు. పోలీసుల సహాయంతో బయటకు తీశారు. చిన్నారి మృతితో బాధిత కుటుంబం విలపిస్తోంది.
అయితే చెరువు చుట్టూ ఫెన్సింగ్‌కి 5కోట్ల 50లక్షల టెండర్ ఖరారు అయ్యిందని, అయితే ఇంకా పనులు ప్రారంభించలేదంటున్నారు బాధితులు. ప్రస్తుతం చిన్నారి కుటుంబానికి 5లక్షల సాయం చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. మృతిచెందిన చిన్నారిని అభితగా గుర్తించిన పోలీసులు.