ఆంధ్ర ప్రదేశ్
ఏపీ కేబినెట్‌కు ఆరుగురు మంత్రుల గైర్హాజరు

ఏపీ కేబినెట్‌కు ఆరుగురు మంత్రులు గైర్హాజరయ్యారు. రేపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కేబినెట్ భేటీకి రాలేకపోయ్యారు. అనారోగ్యం కారణంతో హోమ్ మంత్రి అనిత,టీజీ భరత్, గొట్టిపాటి రవి గైర్హాజరయ్యారు. మరో మంత్రి ఫరూక్ కుటుంబ కార్యక్రమం కారణంగా హాజరు కాలేకపోయారు. ఆరుగురు మంత్రులు కూడా ముఖ్యమంత్రి అనుమతి తీసుకునే గైర్హాజరు అయినట్టు సమాచారం.



