ఆంధ్ర ప్రదేశ్
Road Accident: లారీని ఢీకొన్న బస్సు.. ఒకరు మృతి.. 11 మందికి గాయాలు

తిరుపతి జిల్లా రేణిగుంటలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని అమరరాజా కంపెనీకి చెందిన బస్సు ఢీకొన్నది. స్థానిక నారాయణ కాలేజీ ఎదుట ఘటన వెలుగులోకి వచ్చిం ది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రేణిగుంట అర్బన్ డీఎస్పీ శ్రీనివాసరావు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.