ఆంధ్ర ప్రదేశ్
Kakani: రెండోరోజు కాకాణిని విచారించనున్న సిట్ అధికారులు

Kakani: పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో మాజీ మంత్రి కాకాణిని సిట్ అధికారులు విచారించనున్నారు. ప్రభుత్వ భూ రికార్డులు తారుమారు చేశారన్న అభియోంగపై సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసుపై కస్టడీకి అనుమతిస్తూ రెండో అదనపు జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ శారదా రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో కేసు నమోదు చేశారు. కాగా సీఐడీ నమోదు చేసిన కేసులో ఏ 14 గా కాకాణి ఉన్నారు.
ఈ క్రమంలోనే సాయంత్రం 5 గంటల వరకు న్యాయవాదుల సమక్షంలో పోలీసులు విచారించనున్నారు. ప్రభుత్వ భూముల రికార్డులను పట్టా భూములుగా డిజిటల్ సంతకాలు ఎలా మార్చారని, ఎవరెవరి ప్రమేయం ఉందని అడిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.



