కేంద్రమంత్రి బండి సంజయ్‌కు సిట్ నోటీసులు

Bandi Sanjay: తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు లో సిట్ విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని సిట్ అధికారులు విచారిస్తూనే ఉన్నారు. దర్యాప్తులో భాగంగా గతంలో తమ ఫోన్లు ట్యాపింగ్‌కు గురైనట్లు ఆరోపించి ఫిర్యాదు చేసిన నేతలకు కూడా సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి వారిచ్చే స్టేట్‌మెంట్లను రికార్డు చేస్తున్నారు. ఇప్పటి పార్టీలకు అతీతంగా పదుల సంఖ్యలో నేతలు సిట్ అధికారులకు తమ వాంగ్మూలం ఇచ్చారు.
మొదట జూలై 17న సిట్ నుంచి నోటీసుల అందుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ జూలై 24న విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే, ముందే ఫిక్స్ అధికారిక కార్యక్రమాల వల్ల విచారణకు హాజరుకావడం లేదని విచారణ అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో మరోసారి సిట్ ఈ నెల 8న విచారణకు హాజరు కావాలంటూ బండి సంజయ్‌కి నోటీసులు ఇచ్చింది.
ఈ నేపథ్యంలోనే సిట్ నోటీసులు అందుకున్న బండి సంజయ్ విచారణకు హాజరవుతానని ప్రకటించారు. ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా అదే రోజు విచారణకు అటెండ్ కాబోతున్నారు. అదేవిధంగా బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ అంశంపై పోలీసు ఉన్నతాధికారులకు ఓ లేఖను రాశారు. కేంద్ర నిఘా వర్గాల కీలక సమాచారంతో పాటు సేకరించిన ఆధారాలను కూడా సిట్‌కు అందజేయనున్నారు. అదేవిధంగా కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో బీజేపీ లీగల్ సెల్ పిటిషన్ దాఖలు చేసింది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ పాత్రపై ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాలు ఆధారాలు సేకరిస్తున్నాయి. కేసీఆర్ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని సిట్ ఎదుట రాధాకిషన్ అంగీకరిండం, డీజీపీ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా ప్రభాకర్ రావు స్టేట్‌మెంట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ అగ్ర నేతలకు ఉచ్చు బిగుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై జాతీయ స్థాయిలో చర్చకు బీజేపీ అధిష్టానం సిద్ధమైంది. ఫోన్ ట్యాఫింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.



