తెలంగాణ

ఫోన్ ట్యాపింగ్ కేసు..హరీష్ రావుకు సిట్ నోటీసులు

Harish Rao: సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్‌ లో విచారణకు రావాలని ఆదేశించింది. బీఆర్‌ఎస్‌ కీలక నేత, మాజీమంత్రి హరీశ్‌రావును సాక్షిగా పరిగణిస్తూ సీఆర్పిసీలోని సెక్షన్‌ 160 కింద నోటీసులు ఇచ్చింది. బీఆర్‌ఎస్‌ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలు, కేసీఆర్‌ కుటుంబీకులకు ఈ కేసులో నోటీసులు జారీ చేయడం ఇదే తొలిసారి. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌ పోలీసుస్టేషన్‌లో ఉన్న సిట్‌ కార్యాలయంలో హాజరుకావాలని ఆ నోటీసుల్లో సిట్‌ స్పష్టం చేసింది.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ నుంచి నోటీసులు అందిన నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు తెలంగాణ భవన్‌ నుంచి బయలుదేరి సిట్‌ కార్యాలయానికి వెళ్తారు. ఉదయం 9 గంటలకు ఆయన తన నివాసం నుంచి తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కూ డా అదే సమయానికి పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button