తెలంగాణ
MLA Palvai Harish Babu: సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు హౌస్ అరెస్ట్

Palvai Harish Babu: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబును హౌజ్ అరెస్టుతో పాటు పలువురు బీజేపీ నాయకులను పోలీసులు ముందస్సు అరెస్టులు చేశారు. అటవీశాఖ కాగజ్‌నగర్ డివిజన్ కార్యాలయం ముట్టడికి ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు కాగజ్ నగర్ డివిడిజన్ కార్యాలయానికి వెళ్లకుండా ఉదయాన్నే పాల్వాయి హరీష్ బాబుతో పాటు బీజేపీ నాయకులను అరెస్టులు చేశారు. వివిధ మండలాల నుంచి పోడు రైతులు కాగజ్‌నగర్‌కు రాకుండా ప్రధాన రహదారులపై పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు.



