సినిమా
Singer Kalpana: కల్పన వ్యవహారం.. పోలీసులకు అసలు విషయం చెప్పిన సింగర్

Singer Kalpana: సింగర్ కల్పన వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. పోలీసుల విచారణలో అసలు విషయం చెప్పింది కల్పన. తాను ఆత్మహత్య చేసుకోబోయింది వస్తున్నటువంటి వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు. ఆత్మహత్య అంటూ వస్తున్న వార్తలను పూర్తిగా ఖండించారు. ఇక ఇదే విషయంపై కల్పన కూతురు క్లారిటీ ఇచ్చారు. మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవు.
మరి కొద్ది రోజులలో ఎప్పటిలాగే మేమంతా మీ ముందుకు వస్తాము అయితే అమ్మ ప్రతిరోజు నిద్ర మాత్రలు వేసుకుంటుంది కానీ నిన్న అవి కాస్త డోస్ ఎక్కువగా వేసుకోవడం వల్ల ఇలా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని ఆమె కూతురు చెప్పింది. ఎవరు కూడా తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దు అంటూ కోరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్లు హాస్పిటల్ సిబ్బంది వెల్లడించారు.