సినిమా
Virat Kohli: విరాట్ కోహ్లీ బయోపిక్ లో శింబు!

Virat Kohli: భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, తమిళ సూపర్‌స్టార్ శింబు మధ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్! ఓ చాట్ షోలో విరాట్, సింబు సినిమా “పత్తు తల”లోని “నీ సింహం దాన్” పాటపై ఫిదా అయ్యారు. ఈ పాట వైరల్ కాగా, ఆర్సీబీ పోస్ట్‌లో విరాట్‌ను ట్యాగ్ చేయడంతో శింబు స్పందించారు. ఇద్దరి కెమిస్ట్రీ అభిమానులను ఫిదా చేస్తోంది.
విరాట్ కోహ్లీ, సింబు మధ్య సోషల్ మీడియా సందడి హోరెత్తుతోంది. “నీ సింహం దాన్” పాట రీల్స్‌లో, క్రికెట్ వీడియోల్లో వైరల్ కాగా, శింబు “నీవు నిజమైన సింహం” అంటూ విరాట్‌ను ఉద్దేశించి కామెంట్ చేశారు. ఇద్దరి బియర్డ్ స్టైల్, ఫిట్నెస్ సమానత్వంతో ముంబయిలో విరాట్ బయోపిక్‌లో శింబు నటిస్తాడనే చర్చ జోరందుకుంది. విరాట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే సింబు ఎంపిక కావచ్చని టాక్.