ఆంధ్ర ప్రదేశ్
నగల దుకాణానికి కన్నం.. రూ.4.25 లక్షల వెండి ఆభరణాలు చోరీ

కృష్ణా జిల్లా ఆటోనగర్ గేటులోని జ్యువెలరీ షాపులో చోరీ జరిగింది. షాపు యజమాని రెహ్మాన్ ఉదయం వచ్చి చూసేసరికి షట్టర్ పైకి తెరిచి ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. షాపులోని 20 జతల పట్టీలు, వెండి గ్లాసులు, వెండి చైన్లు, ఉంగరాలు దుండగుడు దోచుకెళ్లినట్లు గుర్తించారు. షాపులోని సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాదాపు 4 లక్షల 25 వేల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు షాపు యజమాని తెలిపాడు.



