సినిమా

Sikandar: సల్మాన్ ఖాన్ ‘సికందర్’ ఓటీటీలో సందడి

Sikandar: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘సికందర్’ థియేటర్లలో నిరాశపరిచినా, ఇప్పుడు ఓటిటి రిలీజ్‌తో మళ్లీ సందడి చేయనుంది. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రేపు స్ట్రీమింగ్ కానుంది. ఫ్యాన్స్‌కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

సల్మాన్ ఖాన్ అభిమానులకు పండగలాంటి వార్త! ఈ ఏడాది ఈద్ సందర్భంగా థియేటర్లలో విడుదలైన ‘సికందర్’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు. అయినా, దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌తో కొత్త ఊపు తెచ్చుకుంది.

రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ రేపు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. సల్మాన్ స్నేహితుడు సాజిద్ నడియాద్వాల నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. థియేటర్లలో సినిమాను మిస్ చేసిన వారికి ఇది గొప్ప అవకాశం. సల్మాన్ ఖాన్ మార్క్ యాక్షన్, రష్మిక చార్మింగ్ తో ‘సికందర్’ ఓటిటిలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button