స్వరూప్ ఆర్‌ఎస్‌జే దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ కొత్త చిత్రం!

Siddhu Jonnalagadda: డీజే టిల్లు సిరీస్‌తో సూపర్ హిట్లు అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్‌కు‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్ ఆర్‌ఎస్‌జే దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందనుంది.
సిద్ధు జొన్నలగడ్డ ‘డీజే టిల్లు’ సిరీస్‌తో భారీ విజయాలు సాధించారు. అనంతరం వచ్చిన ‘జాక్’, ‘తెలుసు కదా’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ ఎంపికలో జాగ్రత్తలు పాటిస్తున్నారు. బడ్జెట్ పరంగా సురక్షితమైన చిత్రాలకే ఓకే చెబుతున్నారు.
తాజాగా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ దర్శకుడు స్వరూప్ ఆర్‌ఎస్‌జే రూపొందిస్తున్న ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌కు సిద్ధు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది.



