జాతియం
Siddaramaiah: పోలీస్ అధికారిపై చెంప పగలగొట్టేందుకు చెయ్యెత్తిన సీఎం సిద్ధరామయ్య

Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఓ పోలీస్ అధికారిపై ఆగ్రహించారు. బెళగావిలో నిర్వహించిన సభలో సిద్ధరామయ్య ప్రసంగిస్తుండగా కొందరు బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు వేదిక వద్దకు దూసుకొచ్చారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నల్లని వస్త్రాన్ని ప్రదర్శించారు.
పాకిస్థాన్‌కు మద్ధతుగా సిద్ధరామయ్య మాట్లాడారని బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో సెక్యూరిటీ లోపంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ అధికారిపై సీఎం సిద్ధరామయ్య చెయ్యెత్తారు. నిరసన తెలిపిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.