Shruti Haasan: శృతి హాసన్ సంచలన వ్యాఖ్యలు: ప్లాస్టిక్ సర్జరీపై ఓపెన్ టాక్!

Shruti Haasan: నటి శృతి హాసన్ మరోసారి తన ప్లాస్టిక్ సర్జరీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీనేజ్‌లో ముక్కు నచ్చక సర్జరీ చేయించినట్లు వెల్లడించిన శృతి, ఈ నిర్ణయం వెనుక కారణాలను బహిరంగంగా చెప్పుకొచ్చారు.
నటి శృతి హాసన్ తన ప్లాస్టిక్ సర్జరీ, ఫిల్లర్స్ వాడకంపై బహిరంగంగా మాట్లాడారు. టీనేజ్‌లో ముక్కు రూపం నచ్చక సర్జరీ చేయించినట్లు వెల్లడించారు. ముఖ సౌందర్యం కోసం ఫిల్లర్స్ వాడానని, ఈ విషయాలను దాచాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇలాంటి నిర్ణయాలను బయటపెట్టడం తన స్వేచ్ఛ అని, ఇతరుల ఛాయిస్‌ను గౌరవిస్తానని అన్నారు. భవిష్యత్తులో వయసు పెరిగితే ఫేస్ లిఫ్ట్‌కు సిద్ధమని చెప్పారు. తన శరీరంపై తాను తీసుకునే నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదని ధీమాగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం శృతి, సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ‘కూలీ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్ కానుంది.