Shruthi Narayanan: ప్రైవేట్ వీడియోపై స్పందించిన కోలీవుడ్ బ్యూటీ

Shruthi Narayanan: తమిళ నటి శృతి నారాయణన్ ప్రైవేట్ వీడియో లీక్ అయిందంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హ్యాష్‌ట్యాగ్‌లు జోరుగా ట్రెండ్ కాగా, శృతి ఇన్‌స్టాగ్రామ్‌లో తీవ్రంగా రియాక్ట్ అయ్యింది.
శృతి భావోద్వేగంతో “ఇది ఆటపాట కాదు.. నాకు, నా కుటుంబానికి కష్టతరమైన సమయం. దీన్ని ఎదుర్కోవడం కష్టంగా ఉంది. నేనూ ఓ స్త్రీని, నాకూ భావాలున్నాయి” అని ఆవేదన వ్యక్తం చేసింది.
“అన్నీ వైరల్ చేయొద్దని వేడుకుంటున్నా. మీ తల్లి, సోదరి వీడియోలు చూసి సంతోషించండి. ఇది నా జీవితం, మీ వినోదం కాదు” అని కోపంతో రాసింది. “స్త్రీలను మాత్రమే ఎందుకు బాధపెడతారు? లీక్ చేసిన వారిని ఎందుకు నిలదీయరు? ఇది అన్యాయం” అని ప్రశ్నల వర్షం కురిపించింది.
డీప్ ఫేక్ వీడియోలు జీవన్మరణ సమస్యగా మారుతున్నాయని, వాటిని పంచే వారు దుష్పరిణామాలకు కారణమవుతున్నారని ఆందోళన చెందింది. “మానవత్వం చూపండి. నిజమైనా, నకిలీ అయినా వీడియోలు వైరల్ చేయొద్దు. అలా చేస్తే చట్టపర చర్యలు తీసుకుంటా” అని హెచ్చరిక జారీ చేసి, చట్ట వివరాలను పోస్ట్ చేసింది. శృతి పోస్ట్‌ల స్క్రీన్‌షాట్స్ ఇప్పుడు నెట్టింట బాగా చర్చనీయాంశమవుతున్నాయి.