Shreya Ghoshal: కడుపులోని బిడ్డకు పాట వినిపించిన శ్రేయ ఘోషల్

Shreya Ghoshal: స్టార్ సింగర్ శ్రేయ ఘోషల్ నెదర్లాండ్స్లోని ఆమిర్యామ్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెను ప్రెగ్నెన్సీతో ఉన్న ఓ ఫ్యాన్ కలిశారు. రోజూ మీ పాటలు వింటూ ఉంటానని, కడుపులోని బిడ్డ సైతం గాత్రం విని ప్రతిస్పందిస్తుందని ఆ ఫ్యాన్ ఘోషలు చెప్పారు. దీంతో ఆమె తన చేతులను అభిమాని కడుపుపై ఉంచి ‘పియు బోలే’ పాటను పాడగా, బిడ్డ కదలడాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ వీడియో వైరలవుతోంది.
తన ప్రాణంలో ప్రాణాన్ని మోయ్యడం ఆ ప్రాణాన్ని క్షేమంగా బయటకు తీసుకురావడం కేవలం స్త్రీ మూర్తికే సాధ్యం. అయితే అభిమన్యుడిలాగా కడుపులో ఉండగానే సకల విద్యలు నేర్చుకోవడం అద్భుతంగా ఉంటుంది. అయితే అచ్చం అలాంటి సంఘటనే ఒకటి మన ముందుకు వచ్చింది. స్టార్ సింగర్ శ్రేయ ఘోషల్ నెదర్లాండ్స్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెను ఓ గర్భిణీ కలిశారు.
రోజూ మీ పాటలు వింటూ ఉంటానని తన కడుపులో ఉన్న బిడ్డ సైతం తన గాత్రం విని మైమరచిపోతుందని ఆమె వెల్లడించారు. తన గాత్రం విని తన బిడ్డ ప్రతిస్పందిస్తుందన్నారు. అయితే శ్రేయా ఘోషల్ చేతులను తన కడుపుపై ఉంచి పియు బోలే పాటను పాడారు. అది విన్న బిడ్డ కదిలి ఆమె పాటకు ప్రతిస్పందించింది. ఆ అద్భుతాన్ని చూసి శ్రేయా ఘోషల్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఇది ఒక అద్భుత అనుభూతి అని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.