తెలంగాణ
Congress: మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు షోకాజ్ నోటీసులు

Congress: తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకి షోకాజ్ నోటీసులు అందాయి. సునీతారావుకు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు ఆల్కాలాంబా నుంచి సునీతారావుకి నోటీసులు జారీ అయినట్లు తెలుస్తుంది.
ఇటీవల పీసీసీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా ధర్నా చేసినందుకు నోటీసులు జారీ చేశారు. పార్టీలో సునీతారావు క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ నోటీసులు పేర్కొన్నారు. ఇందుకుగాను వారం రోజుల్లో లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు.