Akhanda 2: బాలయ్య అఖండ 2లో అదిరిపోయే సర్ప్రైజ్.. పూనకాలే?

Akhanda 2: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ‘అఖండ 2’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మాస్ సీక్వెల్‌లో బాలయ్య మూడు విభిన్న లుక్స్‌లో కనిపించనున్నారని సమాచారం. జూన్‌లో బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్, టీజర్ విడుదల కానున్నాయి.
నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించేలా ‘అఖండ 2’ రూపొందుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారీ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో మాస్ ఫీస్ట్‌గా రానుంది. బాలయ్య రెండు లుక్స్‌లో కనిపిస్తారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ, బోయపాటి మరో సర్‌ప్రైజ్ ప్లాన్ చేశారట.
ఈ సీక్వెల్‌లో బాలయ్య మూడో లుక్ కూడా ఉంటుందని, అది అభిమానులకు విజువల్ ట్రీట్ ఇవ్వనుందని ఇన్‌సైడ్ టాక్. జూన్ 10న బాలయ్య బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేయనున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తుండగా, 14 రీల్స్ బ్యానర్‌పై ఈ చిత్రం గ్రాండ్‌గా నిర్మితమవుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్ అభిమానుల అంచనాలను మించి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయమని టాక్.