ఆంధ్ర ప్రదేశ్
Tirupati: తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం వద్ద అగ్ని ప్రమాదం

తిరుపతి జిల్లా కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. గోవిందరాజస్వామి ఆలయం దగ్గర దుకాణంలో మంటలు చెలరేగాయి. చలువ పందిళ్లకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలు అదుపు చేసింది. మరోవైపు ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఒక ఫోటో స్టూడియో అగ్నికి ఆహుతి అయింది.