సినిమా

Anasuya: శివాజీ వివాదంలో అనసూయ ఫుల్‌స్టాప్!

Anasuya: టాలీవుడ్‌లో హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదాన్ని రేకెత్తించాయి. అనసూయ, చిన్మయి తీవ్రంగా స్పందించారు. నాగబాబు, ప్రకాష్‌రాజ్ మద్దతు ఇవ్వడంతో సోషల్ మీడియా రెండు వర్గాలుగా విడిపోయింది. అయితే సడన్‌గా అనసూయ తన దృక్పథాన్ని మార్చుకుని శివాజీ ఉద్దేశాన్ని పాజిటివ్‌గా అర్థం చేసుకున్నారు. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.

‘దండోరా’ ఈవెంట్‌లో శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో భారీ దుమారాన్ని రేపాయి. నిధి అగర్వాల్ ఘటనను ఉదాహరణగా చూపిస్తూ మాట్లాడటంపై అనసూయ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తప్పు చేసే వారిని వదిలి మాకు నీతులు చెబుతారా’ అని ప్రశ్నించారు. ఈ వివాదం ‘శివాజీ వర్సెస్ అనసూయ’గా మారింది. నాగబాబు, ప్రకాష్‌రాజ్ వంటి వారు అనసూయకు మద్దతు పలికారు. అయితే తాజాగా అనసూయ శివాజీ ఉద్దేశాన్ని మంచిగా అర్థం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.

ఆయన కష్టపడి ఇండస్ట్రీలో ఈ స్థాయికి చేరారని, ఆడపిల్లల భద్రత కోసం పడిన ఆరాటం వెనుక మంచి ఆలోచనే ఉందని పేర్కొన్నారు. అయితే అమ్మాయిలతోపాటు అబ్బాయిల బాధ్యతను కూడా గుర్తు చేసి ఉంటే వివాదం రాకపోయేదని సున్నితంగా సూచించారు. ఈ వ్యాఖ్యలతో మాటల యుద్ధానికి ఫుల్‌స్టాప్ పడినట్లు కనిపిస్తోంది. అనసూయ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button