సినిమా

శివాజీ షాకింగ్ కామెంట్స్.. నెటిజన్స్ మద్ధతు?

టాలీవుడ్ రెమ్యునరేషన్లు, బడ్జెట్లు, టికెట్ ధరలపై నడుస్తున్న చర్చల్లో సీనియర్ నటుడు శివాజీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇండస్ట్రీలో కేవలం 5 శాతం మందికే భారీ డబ్బు వస్తోందని, మిగతా 95 శాతం మంది సామాన్యంగానే ఉన్నారని అన్నాడు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింటా చర్చనీయంశంగా మారాయి.

ఇటీవల ఐ బొమ్మ రవి కేసు తర్వాత టాలీవుడ్‌లో రెమ్యునరేషన్లు, సినిమా బడ్జెట్లు, టికెట్ ధరలపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు శివాజీ ఓ ఇంటర్వ్యూలో స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇండస్ట్రీలో అందరు హీరోలు, దర్శకులు, నిర్మాతలు భారీ రెమ్యునరేషన్లు తీసుకోవడం లేదని, కేవలం 5 శాతం మందికే అత్యధిక డబ్బు వస్తోందని పేర్కొన్నాడు. మిగిలిన 95 శాతం మంది సాదాసీదాగా జీవితం గడుపుతున్నారని చెప్పాడు. ఆ ఐదు శాతం మంది వల్లే మిగతా వారందరిపైనా విమర్శలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. పైరసీకి తాను పూర్తిగా వ్యతిరేకమే అని, ఐ బొమ్మ రవి చేసింది తప్పే అని స్పష్టం చేశాడు.

అయినా అతని టెక్నికల్ టాలెంట్ దేశానికి ఉపయోగపడేలా చూడాలని సూచించాడు. పెద్ద సినిమాల టికెట్ ధరలు పెరిగితే అందరూ తిట్టారు కానీ పండగల్లో బస్సు ఛార్జీలు పెరిగితే ఎవరూ పట్టించుకోరని ఉదాహరణ ఇచ్చాడు. ఇండస్ట్రీలోని ఆర్థిక అసమానతలను బయటపెట్టిన శివాజీ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయినా నెటిజన్లు మాత్రం శివాజినీ సమర్ధిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button