ఆంధ్ర ప్రదేశ్
Annamayya: అద్భుత దృశ్యం.. బయటపడ్డ శివలింగం

Annamayya: అదిగో అల్లదిగో.. శ్రీహరివాసము.. అంటూ దేవదేవుడైన.. తిరుమల శ్రీవారిని ప్రత్యక్షం చేసుకున్న పరమ భక్తుడు అన్నమాచార్యులు. ఉమ్మడి కడప జిల్లా రాజాంపేటకు సమీపంలోని తాళ్ళపాకలో జన్మించారు. అలాంటి పుణ్యస్థలం ఇపుడు మరో అద్భుతానికి వేదికైంది. టీటీడీ నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
ఈ క్రమంలోనే జేఏబీ పూడిక తీస్తుండగా ఆరడుగుల శివలింగం బయట పడింది. వెంటనే స్థానికులు పూజారులతో వచ్చి శివలింగాన్ని శుభ్రం చేశారు. పాలతో శుద్ధి చేసి పూజలు చేశారు. ఈ లింగం సుమారు ఆరు దశాబ్దాలదిగా స్థానికులు భావిస్తున్నారు. పూర్వాశ్రమంలో ఇక్కడ గుడి ఉన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయని చెబుతున్నారు.