శిల్పా శెట్టి దంపతులపై రూ.60 కోట్ల మోసం కేసు

Shilpa Shetty – Raj Kundra: నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా మరోసారి మోసం కేసులో చిక్కుకున్నారు. రూ.60 కోట్ల నిధుల మళ్లింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దర్యాప్తు వేగం పెరిగింది. లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి.
వ్యాపారవేత్త దీపక్ కొఠారి ఫిర్యాదుతో జుహు పోలీసులు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాలపై కేసు నమోదు చేసిన విషయం అందరికి తెలిసిందే. వీరి పై రూ.60 కోట్ల మోసం ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులో నిధుల మళ్లింపులో పాల్గొన్న నలుగురు ఉద్యోగులను గుర్తించారు. వీరు శిల్పా-రాజ్ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. ఒకరు విచారణకు హాజరయ్యారు. మిగతా ముగ్గురికి సమన్లు జారీ చేశారు.
రాజ్ కుంద్రా కంపెనీ లావాదేవీల పేరుతో డబ్బు మళ్లింపు జరిగిందా అనేది విచారణలో ఉంది. కేసు నడుస్తున్నా శిల్పా, రాజ్ తరచూ విదేశాలకు వెళ్తున్నారు. దీంతో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. గతంలో రాజ్ కుంద్రా పేరు క్రిప్టో, యాప్ మోసాల కేసుల్లో వచ్చింది. ఇప్పుడు ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. బాలీవుడ్ సర్కిల్స్‌లో ఈ విషయంపై చర్చ జరుగుతోంది. దర్యాప్తు మరింత లోతుగా సాగుతోంది.



