శిల్పా శెట్టి: నటనతో పాటు వ్యాపారంలో విజయం!

Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి సినిమాలతోనే కాక, వ్యాపారంలోనూ సంచలనం సృష్టిస్తున్నారు. ఆమె బాస్టియన్ రెస్టారెంట్ గొలుసు దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. గోవాలో కొత్త శాఖలు, సెలబ్రిటీల ఆదరణ, భారీ ఆదాయంతో శిల్పా వ్యాపార రంగంలో దూసుకెళ్తున్నారు.
శిల్పా శెట్టి కేవలం బాలీవుడ్ నటి మాత్రమే కాదు, విజయవంతమైన వ్యాపారవేత్త కూడా. ఆమె బాస్టియన్ రెస్టారెంట్ చైన్ ముంబై నుంచి బెంగళూరు, పూణే, గోవా వరకు విస్తరించింది. రంజిత్ బింద్రాతో భాగస్వామ్యంలో 50% వాటాతో శిల్పా ఈ బ్రాండ్‌ను నడిపిస్తున్నారు. నెలకు కోట్లాది ఆదాయం, అత్యధిక జీఎస్టీ చెల్లింపుతో బాస్టియన్ రెస్టారెంట్ రంగంలో అగ్రగామిగా నిలిచింది.
గోవాలో రెండు కొత్త శాఖలు త్వరలో ప్రారంభం కానున్నాయి. సోనాక్షి సిన్హా వివాహ రిసెప్షన్ వంటి సెలబ్రిటీ కార్యక్రమాలకు బాస్టియన్ వేదికగా మారింది. శిల్పా ఆస్తి 134 కోట్లు, అంతేగాక దుబాయ్‌లో విలాసవంతమైన విల్లాలు కలిగి ఉన్నారు.