సినిమా

శర్వానంద్ బైకర్ వాయిదా!

Biker: శర్వానంద్ నటిస్తున్న బైకర్ చిత్రం విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. సాంకేతిక పనులను మరింత మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
శర్వానంద్ కెరీర్‌లో మొదటిసారి బైక్ రేస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న బైకర్ చిత్రం ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ భారీ నిధులతో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మొదట డిసెంబర్ 6న విడుదల చేయనున్నారని ప్రకటించారు.

అయితే ఇప్పుడు ఆ రిలీజ్ తేదీని వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. సినిమా సాంకేతిక పనులను మరింత మెరుగ్గా అందించడానికి, ప్రేక్షకులకు గుర్తుండిపోయే అనుభవాన్ని అందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని థ్రీడీ, ఫోర్‌డీఎక్స్ సహా అన్ని ఫార్మాట్‌లలో విడుదల చేయనున్నారు. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రెట్టీ బ్యూటీ పాట మంచి క్రేజ్ పొందింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button