సినిమా
Sharwanand: భోగి’తో శర్వానంద్ మాస్ రచ్చ… పాన్ ఇండియా సందడి రెడీ!

Sharwanand: శర్వానంద్ నటిస్తున్న ‘భోగి’ చిత్రం నుంచి మేకర్స్ ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్‌లో శర్వానంద్ పూర్తి మాస్ షేడ్‌లో కనిపించి అదరగొట్టారు. సంపత్ నంది డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం మాస్ కట్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది. టైటిల్‌గా ‘భోగి’ని ఖరారు చేసిన మేకర్స్, ఈ రోజు నుంచే షూటింగ్ ప్రారంభించారు.
అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ నిర్మిస్తోంది. పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘భోగి’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. త్వరలో మరిన్ని అప్డేట్స్ రానున్నాయని సమాచారం. మరి, ఈ మాస్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తుందో చూడాలి.