ఆంధ్ర ప్రదేశ్
దిత్వా తుఫాన్ ఎఫెక్ట్… చీరాలలో పలు బీచ్‌లు మూసివేత

Cyclone Ditva Effect: దిత్వా తుఫాన్ ప్రభావంతో బాపట్ల జిల్లా చీరాలలో సముద్ర అల్లకల్లోలంగా మారింది. దీంతో రెండు రోజుల పాటు బీచ్‌లను తాత్కాలికంగా మూసివేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే చీరాల, వేటపాలెం మండలాల్లోని వాడరేవు, రామాపురం, పొట్టిసుబ్బయ్య పాలెం, విజయలక్ష్మీ పురం బీచ్లను మూసివేశారు పోలీసులు. సందర్శకులు ఎవరూ సముద్రం వైపు వెళ్లకుండా తీరం వెంబడీ గస్తీ ఏర్పాటు చేశారు. సముద్ర తీరప్రాంతలకు వచ్చే రోడ్ల పై పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు.



